Header Banner

వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. ఒకే రోజు 2,200 మంది అరెస్ట్! వీరికి బేడీలు వేసి..

  Thu Jun 05, 2025 17:35        U S A

అమెరికా (USA) లో రికార్డు స్థాయిలో అరెస్టులు చోటుచేసుకొన్నాయి. ఒకేరోజు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు 2,000 మందికి పైగా అరెస్టు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఇటీవలే ఐసీఈ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రోజుకు 3,000 మంది వలసదారులను అరెస్టు చేయాలని చెప్పారు. మంగళవారం ఒక్కరోజే 2,200 మందిని అదుపులోకి తీసుకొన్నారని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. ఇది ఐసీఈ డిపార్ట్ మెంట్ చరిత్రలోనే ఓ రికార్డ్. ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఐసీఈ అధికారులు ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ (ఏటీడీ) ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకొన్న వారిని లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలుస్తోంది. పత్రాలు లేకుండా అమెరికాలో ప్రవేశించిన వ్యక్తుల కారణంగా సమాజానికి ఎలాంటి ముప్పు లేకపోతే.. వారిని యాంకిల్ మానిటర్లు, స్మార్ట్ఫోన్ యాప్లు, ఇతర జియోలొకేషన్ పరికరాలతో గమనిస్తుంటారు.

 

ఇది కూడా చదవండి: బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

వారు తరచూ ఐసీఈ కేంద్రాల్లో హాజరు కావాల్సిఉంటుంది. ప్రస్తుతం అధికారులు ఏటీడీలో నమోదైన వలసదారులను ఐసీఈ ఆఫీస్ లో హాజరుకావాలని పెద్దఎత్తున సందేశాలు పంపిస్తున్నారు. వారు రాగానే అరెస్టు చేస్తున్నారు. వీరికి బేడీలు వేసి కార్లలో తరలిస్తున్నారు. ఇలా హాజరయ్యేవారిలో చాలామంది అధికారులు నిర్దేశించినప్పుడల్లా గడువు తప్పకుండా ఐసీఈ కేంద్రాల్లో హాజరైన వారున్నారు. ఇక గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరుకాని వారుంటే మాత్రం.. అలాంటివారు డిపోర్టేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. దీనిపై ఐసీఈ ప్రతినిధి మాట్లాడుతూ "తాజాగా తాము అరెస్టు చేసిన వారిని ఈ ప్రోగ్రామ్ నుంచి తొలగించాలని ఇమిగ్రేషన్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వాటిని అమలుచేస్తున్నాం" అని పేర్కొన్నారు. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిలియన్ల కొద్దీ వలసదారులను వెనక్కి పంపిచేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఐసీఈకి సాధ్యం కాదని ఆ సంస్థ మాజీ అధికారి పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ సంస్థ ప్రస్తుతం 20,000 యాంకిల్ మానిటర్లను వినియోగిస్తోంది. వీటిని ధరించిన వారందరూ అధికారుల ఎదుట హాజరైనప్పుడు అరెస్టులు చేస్తున్నారు. ఈ చర్యలతో పత్రాలు లేకుండా వచ్చిన చాలామంది వలసదారుల్లో భయం రేకెత్తుతోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USArrests #Record #Immigrants #SingleDay #Immigranthunt